హెచ్చరిక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం - భద్రాచలం
విశ్వంభర , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం (తెలంగాణ) వారిచే సృష్టించబడి రెండు దశాబ్దాల కాలంగా పైన చూపబడిన కళాత్మక పనితనము కలిగిన శ్రీసీతారామలక్ష్మణుల కళాత్మక మూలమూర్తి లేక మూల విగ్రహములను లేక ప్రతిరూపములను వారిచే బహుకాలంగా ప్రచురించబడి బహుళ జనాదరణ పొందుట చేత మరియు కాపీరైటు చట్టముక్రింద వారి పేరున రిజిస్టరు కాబచుటవలన సదరు కళాత్మక పనితనము కలిగిన విగ్రహాల ఛాయచిత్రములను ప్రచురించుటకు వారు మాత్రమే సర్వహక్కులు కలిగియున్నారని ఇందుమూలముగా తత్పంబంధిత వారందరికి తెలియజేయుటమైనది. కాగా కొందరు నీతిబాహ్యపు ముద్రణదారులు వ్యాపారులు పై చూపబడిన కళాత్మక పనితనము కలిగిన మూలమూర్తి లేక మూల విగ్రహములు రాయచిత్రములకు గల బహుళ జనాదరణను ఆసరాగా తీసుకొని ఆక్రమ లాభార్జన పొందు దురుద్దేశముతో కొనుగోలుదారులను మభ్యపరిచే లేక మోసగించే విధముగా పై చూపబడిన కళాత్మక పనితనము కలిగిన విగ్రహముల ఛాయచిత్రములను మాళ్లయింట్లచే ముద్రించబడినవిగా విక్రయించుచున్నట్లు మాక్షయింట్ల దృష్టికి వచ్చినది. సదరు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడే ముద్రణదార్లు, వ్యాపారస్తులు వారికి సహకరించే వారిపైన సివిల్/క్రిమినల్ చర్యలు తీసుకొనబడునని అంతేకాక సదరు శిక్షార్హమైన నేరములకు పాల్పడేవారు జైలుశిక్ష, జరిమానా లేక రెండుగాని అనుభవించుటకు భాద్యులగుదురని ఇందుమూలముగా హెచ్చరించటమైనది. సదరు ఛాయచిత్ర ముద్రణదారులు మరియు వ్యాపారస్తులు వారి ఆధీనంలో ఉన్న ఛాయా చిత్రములు ది.20.06. 2025 తరువాత విక్రయించిన యెడల భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము వారిచే కాపీ రైటు చట్టం ప్రకారం చర్యలు గైకొనబడునవి హెచ్చరించడమైనది. సదరు ఛాయ చిత్రములను ముద్రించుటకు మరియు విక్రయించుటకు ఆసక్తి గల ముద్రణదారులు /వ్యాపారస్తులు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము వారి అనుమతి కొరకు సంప్రదించగలరు.



