విజ‌య‌శాంతి సంచలన ట్వీట్‌.. కిషన్ రెడ్డికి కౌంటర్..!

విజ‌య‌శాంతి సంచలన ట్వీట్‌.. కిషన్ రెడ్డికి కౌంటర్..!

సీనియర్ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు.

సీనియర్ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. అయితే, దీనిపై విజయశాంతి ట్విట్టర్(X) వేదికగా స్పందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయం సరైందికాదని సంచలన ట్వీట్ చేశారు.

ప్రాంతీయ భావోద్వేగాలు.. ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని విజయశాంతి పేర్కొన్నారు. ఇది అర్థం కాని వారు.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్దే, జయలలితల నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ ఇచ్చిన రాజకీయ సమాధానం ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Read More కాంగ్రెస్ నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయడంలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమవుతోందన్నారు. మరోవైపు తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

 

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు