28 రోజుల పాటు పశువులకు టీకాలు..

వెటర్నరీ డా.రవీందర్.

28 రోజుల పాటు పశువులకు టీకాలు..

విశ్వంభర,ఇనుగుర్తి: ఏప్రిల్ 17 నుంచి మే 14 వరకు 28 రోజులపాటు మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు వివిధ గ్రామాలలోని పశువులకు గాలికుంటు వ్యాధికి టీకాలు ఉచితంగా ఉన్నట్లు ఇనుగుర్తి వెటర్నరీ డా.మోరపాక రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర పశు వైద్య పశుసంవర్ధక శాఖ జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాలకు అమలుకు ఆదేశించినట్లు చెప్పారు. ఎద్దులు,ఆవులు,గేదలు,దున్నలు వెరసి 3 నెలల వయసు దాటిన వాటన్నింటికీ టీకాలు వేయించుకోవాలని సంబంధిత యజమానులకు సూచించారు. టీకాలు వేయడానికి వచ్చే వారికి సహకరించాలని ఆయా గ్రామ పెద్దలను కోరారు. టీకాలను పశువులకు వేయించి కాపాడుకోవాలని పేర్కొన్నారు.టీకాలు వేసే రోజులలో చికిత్స కోసం తీసుకువచ్చే పశువులను ఉ.10: 30 తర్వాత ఆసుపత్రికి తీసుకు రావాలన్నారు.

Tags: