మంత్రి ఉత్తమ్ తండ్రి మృతి పట్ల వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం
On
విశ్వంభర, హైద్రాబాద్ ; సాగునీటి పారుదల,పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీ రవిచంద్ర తన అల్లుడు డాక్టర్ జే.ఏన్.వెంకట్, సన్నిహితులు వీ.ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పురుషోత్తమ్ రెడ్డి భౌతికకాయంపై పూలమాల వేసి,పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులను ఎంపీ వద్దిరాజు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పురుషోత్తమ్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ రవిచంద్ర భగవంతున్ని ప్రార్థించారు.