తొడ భాగము నుండి గుండెకు వాల్వు రీప్లేస్మెంట్ చికిత్స దిగ్విజయం - సీనియర్ డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ గుండె వైద్య నిపుణుడు
తక్కువ సమయంలోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
విశ్వంభర, హనుమకొండ జిల్లా ;- కవాటాల జబ్బుతో బాధపడుతున్న రోగికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి నొప్పి లేకుండా అతి తక్కువ సమయంలోనే గుండె పనితీరు మెరుగ్గా పనిచేసేందుకు అనుభవజ్ఞులైన వైద్యులతో కవాటాల జబ్బు నుండి రోగిని కాపాడమని మెడికవర్ వైద్య బృందం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ అజ్మతుల్లా ఖాన్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్స కోసం తాను ఎన్నో ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ గుండెకు సంబంధించి వ్యాధి కాబట్టి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తేనే తన సమస్యకు పూర్తి పరిష్కారం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో మెడికవర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు చేస్తారని తెలుసుకున్న అతను తనను సంప్రదించినట్లు వివరించారు. వెంటనే ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యుల బృందం డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆస్తమా బిపి షుగర్ తో అతని పరిస్థితులను గమనించిన వైద్యులు ప్రాథమిక నిర్ధారణ చేసి సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు సంబంధించిన నాళాల పనితీరును మెరుగుపరిచేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతనికి చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. కవాటాల జబ్బుతో బాధపడుతున్నట్లు నిర్ధారించి ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా తొడ భాగము నుండి వాల్వ్ ను గుండెకు చేర్చి రీప్లేస్మెంట్ చేసినట్లు తెలిపారు. అతనితో మాట్లాడుకుంటూనే ఎలాంటి నొప్పి లేకుండా వైద్యుల పర్యవేక్షణలో గుండె వాల్వును తిరిగి పొందుపరిచామన్నారు. 24 గంటల్లోపే ఆ వ్యక్తి సాధారణ పరిస్థితిలకు చేరుకొని వైద్యుల పర్యవేక్షణలో స్వయంగా తానే నడుచుకుంటూ సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స అనంతరం 15 సంవత్సరాల వరకు రోగికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సాధారణంగా ఎక్కువ శాతం మంది గుండె పోటుతో చనిపోతున్నారు. కవాటాల జబ్బుతో బాధ పడుతున్న వాళ్లు రోజు రోజుకు వాళ్ల శరీరంలో గుండెకు సంబంధించి మార్పులు చెందుతూ ఉంటాయి. మిగతా అవయవాల పనితీరును క్షీణింప ప్రక్రియ ఆరంభం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తరుణంలో శరీరానికి మత్తు ఇవ్వడం వల్ల పూర్తి స్పర్శను కోల్పోవాల్సి ఉంటుంది. చివరికి చికిత్స పూర్తయినప్పటికీ శరీరము నుండి మత్తు వదిలిన అనంతరం పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. అలా రకరకాల సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్లకు మెడికవర్ ఆసుపత్రిలో అతి తక్కువ సమయంలోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం సేవలందిస్తున్నట్లు డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గుండె వైద్య నిపుణుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు, ట్రై సిటిస్ పట్టణ ప్రజలు మెడికవర్ ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బిజినెస్ హెడ్ నమ్రత, సీనియర్ అనస్టిస్ట్ డాక్టర్ ప్రమోద్, డాక్టర్ వాసు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనస్తీసియా క్రిటికల్ కేర్ డాక్టర్ లక్ష్మీదీపక్, కార్డియాలజిస్టులు డాక్టర్ షఫీ, డాక్టర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.



