వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

విశ్వంభర, హైదరాబాద్ :ఆగస్టు 3న హైదరాబాద్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. వైశ్యుల జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం  కల్పించాలని డిమాండ్  చేశారు. వైశ్య రాజకీయ రణభేరికి ఇంటర్నేషనల్  వైశ్య  ఫెడరేషన్ సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి IVF సభ్యులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త,  నంగునూరి రమేష్, కొదుమూరి దయాకర్, బుక్కా ఈశ్వరయ్య, కొత్త రవి కుమార్,  గజవాడ సత్యనారాయణ, మురళి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.