ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి
On
విశ్వంభర, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమె పేరు మనీలా అని… ఆమె పై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మనిలా తో సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఛత్తీస్ ఘడ్,దంతెవాడ జిల్లా ఎస్ పీ గౌరవ్ రాయ్, పోలీస్ అధికారుల ఎదుట 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు తెలిపారు. ఛత్తీస్ ఘడ్,సుకుమా జిల్లా,కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమెల్ అటవీ ప్రాంతంలో ఒక మహిళ మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags: Encounter