కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందచేసిన బిజెపి మండల కిసాన్ మోర్చా

WhatsApp Image 2024-07-09 at 4.10.37 PM

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 09 :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీలా పేరుతో కాలయాపన చేయడాన్ని బీజేపీ కిసాన్ మోర్చ నిరసిస్తుంది. ఇది యావత్ తెలంగాణ రైతులను మోసం చేయడమేనని బిజెపి కిసాన్ మోర్చా భావిస్తుంది. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పైబడిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో నెరవేర్చకపోవడం దురదృష్టకరం మేనిఫెస్టోలో  విధంగా కాకుండా సబ్ కమిటీల అభిప్రాయాల పేరుతో కాలయాపన చేయడం విడ్డూరం.
 రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోల పరుస్తూనే ఉంది. రుణమాఫీ కానీ కారణంగా  రైతులు తలదించుకోవాల్సి వస్తుంది. ఇక కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు అందిస్తాం అన్న ఆర్థిక తోడ్పాటు  ఈ ప్రభుత్వం నోరు మెదపకపోవడం దుర్మార్గం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆంబోజు ఆంజనేయులు ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు  కాశీనాథ్ , జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బండారి సత్యనారాయణ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల కుమారస్వామి ,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మహేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ సాయి, బూత్ అధ్యక్షులు లోడి వెంకటయ్య, అశోక్ రెడ్డి,వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు

Read More విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. -సీఐ ఆదిరెడ్డి. -మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు.