తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

WhatsApp Image 2024-07-24 at 14.05.57_8189fea5
  విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీలకు పక్క భవనం నిర్మించకపోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు