వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

విశ్వంభర,హైదరాబాద్ : వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్, కాచం సాయి, మీర్పేట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ తేరటపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు  నాల్ల శ్రీనివాస్ గుప్త,వైశ్య విద్యావంతుల వేదిక నాయకులు బుద్ధ ప్రవీణ్, శ్రీకాకోళ్ల రాజు గుప్త, వైశ్య యూత్ ఫోర్స్ నాయకులు  బూరుగు ప్రవీణ్, సముద్రాల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-07-27 at 12.50.58 PM (1)