తెలంగాణ పాలీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!
2024-25 విద్యాసంవత్సరానికిగానూ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
2024-25 విద్యాసంవత్సరానికిగానూ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూన్ 22వ తేదీ నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం, జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై 7వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూలై 9న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందనీ.. 13నుంచి సీట్ల కేటాయింపు ఉండనునట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం కల్పించారు. అలాగే జూలై 24వ తేదీ లోపు అన్ని సీట్లను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మరోవైపు జూలై 23న స్పాట్ ఆడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.