తెలంగాణ ఉద్యమకారుడు గుండె పోటుతో మృతి - నివాళులు అర్పించిన ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. కాచం సత్యనారాయణ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుడిని ఆదుకోవాలి - డా. కాచం
విశ్వంభర, సరూర్ నగర్ :- తెలంగాణ ఉద్యమకారుడు రాజు (బిక్షపతి ) గుండె పోటుతో మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం , టిఎఫ్టియు ల రాష్ట్ర అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ వారి భౌతిక ఖాయానికి పూలమాల వేసి ఉద్యమ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజు తెలంగాణ ఉద్యమంలో నిరంతరం రాష్ట్ర సాధన ఉద్యమంలో పోరాటం చేసారు. అలాగే కాచం యువసేన నాయకుడిగా సేవలందించారు. వృత్తి పరంగా వంటల మాస్టర్ గా పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంభం సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్బంగా డా. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎనలేని కృషి చేసి రాష్ట్ర సాధనలో ఎంతోమంది ఉద్యమకారులు పోరాటం చేసారని , అలాంటి వ్యక్తులలో రాజు కూడా ఆనాడు ఉద్యమంలో కీలకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పని చేసాడని గుర్తు చేసారు. నాటి ఉద్యమంలో ధర్నాలతో , రాస్తోరోకోలలో , నిరసనలలో పాల్గొని ఉమ్మడి సమైక్య రాష్టంలో పోలీసుల లాఠీ దెబ్బలకు గురి అయ్యాడని , పోలీసులు స్టేషన్ లలో నిర్బంధించిన విషయాన్నీ గుర్తు చేస్తూ రాజు పోరాట పటిమను ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డా. కాచం విజ్ఞప్తి చేశారు. ఏ లోకాన ఉన్న వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలనీ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాని డా. కాచం తెలిపారు. వీరితో పాటు ఉద్యమకారులు దాము మహేందర్ యాదవ్ , అరుణ్ అంబెడ్కర్, ఇరుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.