కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విశ్వంభర, నెల్లికుదురు: పెళ్ళి జరిగిన ఇళ్లలో ఆనందం, సౌభాగ్యం వెల్లి విరిసేందుకే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను  లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ చెప్పారు. మండల కేంద్రం నెల్లికుదురు రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 20 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి తో పాటు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రైతు రుణమాఫీ,పంటలకు మద్దతు ధర, వ్యవసాయ పరికరాల అందజేత,తినడానికి సన్న బియ్యంతో పాటు రేషన్ కార్డుల మంజూరు,ఉండడానికి ఇందిరమ్మ ఇండ్లు, మహిళల ప్రయాణానికి ఫ్రీ బస్, గృహావసరానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.ప్రజలు నిరంతరం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న,డిటి శ్రీనాథ్,వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kalyana-lakshmi-mla-who-distributed-the-cheques/article-15496

Tags: