కార్మికుల సమస్యలను విస్మరిస్తే అభివృద్ధి రథం నిలిచిపోతుంది
విశ్వంభర, హైదరాబాదు : ఆర్టీసీ కార్మికుల ఐక్యతే ప్రభుత్వాల నిర్ణయాలను మార్చగల శక్తి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను విస్మరిస్తే రవాణా వ్యవస్థతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా స్థంభించిపోతుందని హెచ్చరించారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి విఎస్టీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన టీజీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్. బోస్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ పాల్గొన్నారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు కె. పద్మాకర్, అధ్యక్షుడు ఎస్. బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న హాజరయ్యారు. సమ్మె సందర్భంగా మరణించిన డ్రైవర్ కె. శంకర్‌కు నివాళులర్పిస్తూ సమావేశంలో మౌనం పాటించారు. కార్మికులు ఏకమైతే పెద్ద పారిశ్రామిక వేత్తలూ వెనక్కి తగ్గాల్సిందేనని పేర్కొన్నారు. కార్మిక సంఘాలను బలహీనపరిచే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. శంకర్ ఆత్మబలిదానంతో ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చిందన్నారు. యూనియన్ల బలోపేతంతో పాటు అవసరమైతే ఎన్నికల ద్వారా హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ అలీ, వెంకన్న గౌడ్, డి. గోపాల్ తదితర నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.