మంత్రి శ్రీధర్ బాబు ను కలిసిన భూంపెల్లి రాజయ్య
విశ్వంభర, కమాన్ పూర్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను హైదరాబాద్ లో మంగళవారం కమాన్ పూర్ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు భూంపెల్లి రాజయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమాన్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లె లో గల డ్రైనేజి నీరు బయటకు పంపించడం కోసం కిష్టంపల్లె నుండి పిల్లిపల్లె రోడ్డులో గల కే ఎన్ ఫంక్షన్ హల్ వరకు నిర్మించుటకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ.. వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, లల్లూ, సాగర్ల కొమురయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.