కొనుగోళ్ల కోసం రొడ్డెక్కిన రైతన్నలు
విశ్వంభర, సిద్దిపేట: వరిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామ రైతులు రొడ్డెక్కారు. సిద్దిపేట-ముస్తాబాద్ ప్రధాన రహదారిలోని గ్రామ స్టేజ్ వద్ద రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ఆలస్యమైతే వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతుల ధర్నాతో అధికారులు సానుకూలంగా స్పందించారు. కొనుగోళ్లలో వేగం పెంచుతామని హామీనిచ్చారు. ధర్నాలో నాయకులు మాజీ సర్పంచ్‌లు గడ్డం తిరుపతి రెడ్డి, దశరథం, రైతు సంఘాల నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు