దూల్పేట్ లో 1.630 కేజీల గంజాయి పట్టివేత
విశ్వంభర, జిహెచ్ ఎంసి: దూల్పేట జాలి హనుమాన్ మందిర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ మహేష్ సిబ్బంది కలిసి ఓ ఇంటిపై దాడి నిర్వహించి 1.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు రూ. 21,850 నగదును కూడా సీజ్ చేశారు. ఈ కేసులో అరవింద్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మనీష్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ మహేష్ తెలిపారు. నిందితున్ని, గంజాయిని, నగదును దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.