ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
- వీధి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ సంఘటనలను ప్రజలు మర్చిపోలేదు
- వైసీపీపై రాప్తాడు టిడిపి నేతల ఆగ్రహం
విశ్వంభర, రాప్తాడు : ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండదని రాప్తాడు నియోజకవర్గ టిడిపి నాయకులు అన్నారు. ఇదే మే నెలలో జరిగిన సంఘటనలను రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం వారు ఎప్పటికీ మరువలేరన్నారు. రాప్తాడు నియోజకవర్గ టిడిపి ఎస్సీ సెల్ నాయకులు, మండల నాయకులు ఇదే మే నెలలో గత వైసిపి ప్రభుత్వం లో జరిగిన దారుణాల గురించి గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వద్ద మాజీ డ్రైవర్ గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం.. సదరు ఎమ్మెల్సీతో తలెత్తిన వివాదం కారణంగా హత్యకు గురైన సంఘటన నేటికీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. హత్య చేసి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకొచ్చి వాళ్ల ఇంటి వద్దే పడేసి, మొదట్లో దీనిని ఒక ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అయితే, తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన మరణించాడని దర్యాప్తులో వెల్లడైన విషయం అందరికీ తెలుసునన్నారు. రాజకీయ అండతో అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వారిలో జవాబుదారీతనం ఎంతలా లోపించిందో చెప్పడానికి ఈ ఘటనే స్పష్టమైన నిదర్శనం అని టిడిపి నాయకులు అన్నారు. ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ కోవిడ్-19 సమయంలో పీపీఈ కిట్ల కొరత గురించి ఆందోళనలు లేవనెత్తిన తర్వాత సస్పెండ్ చేశారన్నారు. అంతటితో వదలకుండా బహిరంగంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆయన్ని అరెస్టు చేశారన్నారు. తద్వారా వైసీపీ పాలనలో ప్రశ్నించే గొంతుకల అణిచివేతకు మరియు ఎస్సీ వృత్తినిపుణులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఆయన ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయారన్నారు. ఈ ఘటనలన్నీ కలిపి చూస్తే.. ముఖ్యంగా ఎస్సీ వ్యక్తులు, వృత్తిపరమైన నిపుణులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై వైసీపీ హయాంలో
నిరంతర బెదిరింపులు, దౌర్జన్యాలు మరియు వ్యవస్థాగత అన్యాయాలకు ఇవి అద్దం పట్టాయన్నారు. ఇలా ఇదే మే నెలలో ఎస్సీలను ఎంతోమందిని పొట్టను పెట్టుకున్న పార్టీ వైసిపి అని టిడిపి ఎస్సీ సెల్ నాయకులు అన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాకూడదన్న అభిప్రాయంలో ఎస్సీ సామాజిక వర్గం మొత్తం ఉందని అన్నారు.