మహంకాళి డివిజన్‌లో పోక్సో కేసు తీర్పు

మహంకాళి డివిజన్‌లో పోక్సో కేసు తీర్పు

  • నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

విశ్వంభర, హైదరాబాదు : బాలలపై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు వెలువడింది. రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన పోక్సో కేసులో నిందితుడు అబ్దుల్ రెహమాన్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి జి. ఉదయ్ భాస్కర్ రావు నేరం రుజువైందని తేల్చారు. 2019 అక్టోబర్ 29న జలవిహార్ సమీపంలో ఆటో ఎక్కిన 11 ఏళ్ల బాలుడిని నిందితుడు దారి మళ్లించి బతుకమ్మ కుంట వద్ద రైల్వే ట్రాక్ పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ప్రతిఘటించడంతో గాయపరిచాడు. బాలుడి కేకలు విని స్థానికులు స్పందించి బాధితుడిని రక్షించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 230/2019గా  కేసు నమోదు చేశారు. కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించింది. బాధిత బాలుడికి రూ.75,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారి సి. వేణుగోపాల్ రెడ్డి, కోర్టు మానిటరింగ్ అధికారి బి. సురేష్ కుమార్, తొలి దర్యాప్తు అధికారి తోట చెంచల బాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎ. రామాదేవి, కె. ప్రతాప్ రెడ్డి, లీగల్ కౌన్సెలర్లు టి. కల్పన, ఆర్.హెచ్. హిమామీనన్ కీలక పాత్ర పోషించారు. కోర్టు విధుల్లో జె. సాయి కుమార్, కె. రాజు సహకారం అందించారు.
ఈ కేసును పకడ్బందీగా నడిపించిన పోలీస్ మరియు లీగల్ బృందాన్ని డిసిపి రక్షిత కృష్ణమూర్తి అభినందించారు.

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/judgment-of-pocso-case-in-mahankali-division/article-15500

Tags: