పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
- బీఆర్‌ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున రెడ్డి
విశ్వంభర, హుస్నాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు అయిలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని విమర్శించారు.కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజలపై అదనపు భారం మోపిందని అన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌లో కూరగాయలు, సరుకుల ధరలు భగ్గుమంటున్న పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. “మాది ప్రజల ప్రభుత్వం” అని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు విశ్వసించి మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చినా, ఇప్పుడు అదే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.