తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
విశ్వంభర, చింతపల్లి: తెలంగాణ ప్రజానాట్యమండలి నాల్గవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చింతపల్లి మండల పరిధిలోని గోడుకొండ్ల వీటి నగర్ లో సోమవారం మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చేల్లం పాండురంగారావు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను కళారూపాల ద్వారా సమాజానికి చేరవేస్తూ సాంస్కృతిక ఉద్యమాలకు దిశా నిర్దేశం తెలంగాణ ప్రజానాట్యమండలి చేస్తుందన్నారు. కళాకారులు సమాజ మార్పుకు వారదులుగా నిలవాలని ప్రజల పక్షాన నిలిచే కళా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈనెల 25, 26వ తేదీలలో హైదరాబాద్ హిమాయత్ నగర్ లో జరిగే రాష్ట్ర మహాసభలకు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా నల్లగొండ పట్టణంలో ఈనెల 22న జరిగే తెలంగాణ ప్రజానాట్యమండలి నాలుగవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాస మంజుల భాస్కర్, ఉప సర్పంచ్ మహమ్మద్ ఖలీల్, వార్డు మెంబర్ సైదులు పాల్గొన్నారు.