సమాజ హితానికి పాటుపడాలి

సమాజ హితానికి పాటుపడాలి

  • : ఎస్పీ నరసింహ  

విశ్వంభర, సూర్యాపేట: సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో షీట్స్ ఉన్న వ్యక్తులకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో  డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ నరసింహ  హాజరై మాట్లాడారు. గతంలో చేసిన పనుల నుండి పాఠాలు నేర్చుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. సమాజ హితం కోసం, మంచి పనుల కోసం పాటుపడాలని కోరారు. అసాంఘిక చర్యలకు, నేరాలకు పాల్పడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ నమోదు చేస్తాము, పిడి యాక్ట్ పెట్టీ జైలుకు పంపిస్తాం అని హెచ్చరించారు. ప్రతి నెలా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరిపై పోలీసు నిఘా ఉన్నది ప్రస్తుత జీవన శైలి, ఎలాంటి పనులు చేస్తున్నారు అని గమనిస్తున్నాము అన్నారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఎలాంటి ఫైరవిలు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన చేసి చట్టప్రకారం షీట్స్  ఎత్తి వేస్తామని అన్నారు. అలవాటుగా నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కటిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.  కేసుల్లో పోలీసు దర్యాప్తులో వేగం, నాణ్యత పెరిగినది పక్కా ఆధారాలతో కోర్టులకు పంపిస్తాం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడవద్దని అని కోరారు. కేసుల్లో త్వరితగతిన శిక్షలు అమలౌతున్నాయి అన్నారు. గరిడేపల్లి, మెళ్లచెరువు, మునగాల, మోతే పోలీస్ స్టేషన్ ల నందు నమోదైన హత్య కేసుల్లో జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ లు ఏడుకొండలు, సాయిరాం, శివతేజ, సిబ్బంది పాల్గొన్నారు.

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/it-should-be-for-the-welfare-of-the-society/article-15478

Tags: