రామన్నపేట ప్రభుత్వ ఉపాధ్యాయునికి రాష్ట్ర స్థాయి అవార్డు
విశ్వంభర, రామన్నపేట: హైదరాబాదులోని రవీంద్ర భారతిలో మాజీ హర్యానా గవర్నర్, మాజీ మంత్రి దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సినీ నటులు కవిత, శివపార్వతి, గాయకులు మనో, శర్మ చేత ప్రగ్నిక ఫౌండేషన్ దశమ వార్షికోత్సవంలో వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేసి, సన్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న నీలం శేఖర్ తన సామాజిక సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గత దశాబ్ద కాలంగా వారు సమాజంలో చేస్తున్న సహాయ కార్యక్రమాలు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వేదికల తరుపున రాష్ట వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు గౌరవ సలహాదారుడిగా ఉంటున్నారు, ప్రభుత్వ ప్రతిభావంతుల విద్యార్థులకు పుస్తకాలు, నిరుద్యోగులకు మెంటార్ గా ఉంటున్నారు, సామాజిక సంస్థలకి సమన్వయ కర్తగా ఉంటున్నారు. అక్షర, వారియర్ మన ఆపత్బంధువులు, బహుజన అక్షర చైతన్య వారదులు, వివిధ రంగాలకు చెందిన ఫౌండేషన్ లో కీలక పాత్ర పోషిస్తూ అనేక సామాజిక సంస్థలకి గౌరవ సలహాదారుడిగా ఉంటున్నారు. వారి ఫాలోవర్స్ చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలువులు ప్రశంసలు తెలియజేశారు.