రైస్ మిల్లు తనిఖీ
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఉన్న బాలాజీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లును మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలంధర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో అందుబాటులో ఉన్న ధాన్యం నిల్వలు, ఇప్పటివరకు వచ్చిన లారీల సంఖ్య, అన్‌లోడ్ చేసిన లారీల వివరాలను నిర్వహణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మిల్లులో బియ్యం సంచులు పూర్తిస్థాయిలో నిల్వ ఉండటంతో, రాబోయే రోజుల్లో అన్‌లోడింగ్ ప్రక్రియ మరింత అందుబాటులో ఉన్న ఖాళీ జాగాలో అన్లోడింగ్ కొనసాగనున్నట్లు తెలియజేశారు. అధికారి మిల్లులోని పరిస్థితులను పరిశీలించి, నిల్వలు మరియు రవాణా నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చించారు.