మునిగలవీడు లో సుందరయ్య వర్ధంతి
విశ్వంభర, నెల్లికుదురు: సిపిఎం ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో బత్తే సత్యనారాయణ అధ్యక్షతన కా.పుచ్చలపల్లి సుందరయ్య 41 వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు పాల్గొని మాట్లాడుతూ భూస్వాముల ఇళ్లలో పుట్టిన సుందరయ్య ఉద్యమ బాటలో తన జీవితాన్ని పేదలకు అంకితం చేశారన్నారు. రాజకీయాల్లో ప్రచారం పెరిగి ప్రజల పట్ల బాధ్యత తగ్గిందని,పదవులు పెరిగాయి విలువలు కనుమరుగై పోతున్న ప్రస్తుత తరుణంలో సుందరయ్య జీవితం ఒక వెలుగు దీపంలా కనిపిస్తుందన్నారు. సుందరయ్య ఆశయాలకు పునరంకితలు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండా వెంకన్న,యాకోబు,వీరయ్య, కమలాకర్,పవన్,యాకయ్య,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.