డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి జైలు
- : పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం
విశ్వంభర, సూర్యాపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన పట్టుపడిన ముగ్గురిలో ఒక్కరికి 2 రోజులు జైలు శిక్ష, జరిమానా, ఇంకొకరికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మరొకరికి జరిమానా సూర్యాపేట కోర్టు విధించినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురిని ఈరోజు 19-05-2026 కోర్టులో హాజరుపర్చగా ఒక్కరికి 2 రోజుల జైలు శిక్ష మరియు Rs.1,200/- జరిమానా, ఇంకొకరికి ఒక్కరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మరియు ఇంకొకరికి రూ.1,400/- జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ, ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.పోలీసులు చేసే వాహన తనిఖీలు ప్రజల ప్రాణరక్షణ కోసమే అని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.