కార్మికుల సమస్యలు పట్టించుకోని వారిని ఎన్నుకోవద్దు : మొగుళ్ల రాజిరెడ్డి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: జలమండలి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన త్రిశూలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు, యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి కార్మికులను కోరారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి విఎస్టీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పట్టించుకోని సంఘాలను తిరిగి ఎన్నుకోవద్దని సూచించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐఎన్‌టీయూసీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలే యాదయ్య, బొర్రా జ్ఞానేశ్వర్, చల్ల నరసింహరెడ్డి, ఆర్.డి. చంద్రశేఖర్, యరగోని నాగన్న గౌడ్, అదిల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mogulla-rajireddy-dont-elect-people-who-dont-care-about-workers/article-15472

Tags: