హుస్నాబాద్‌లో ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం
- : హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి
విశ్వoభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మున్సిపల్, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై “ఫోటోలకు ఫోజులిస్తున్నాడు” అంటూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇప్పటివరకు 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 40 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని తెలిపారు. రైతులను దళారీ వ్యవస్థ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడు మండలాల్లో ప్రతివారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మంచి పనులను చెడుగా చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పాలనలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామీణ మరియు మున్సిపల్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల, 200 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని, హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, సింగిల్ విండో, మున్సిపల్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.