చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం జటావత్ తండా లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయనో అజేయమైన శక్తి, ఒక చరిత్ర, మరియు ధైర్యానికి ప్రతీక.. ఆయన జీవితం మనకు ఎన్నో గొప్ప పాఠాలను నేర్పుతుంది అని అన్నారు. పరాయి పాలనను ఎదిరించి, హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు మన శివాజీ శత్రువుల స్త్రీలను సైతం తల్లీ సమానంగా గౌరవించిన గొప్ప సంస్కృతి శివాజీ మహారాజ్ గారిది అని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని దృఢ సంకల్పం, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే పరిపాలనా దక్షత ఆయన సొంతం. శివాజీ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించిన యువతకు, కమిటీ సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేక అభినందనలు అని అన్నారు. శివాజీ మహారాజ్ చూపిన ధైర్య సాహసాలు, దేశభక్తి మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.