రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్
- రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గూగులో తు కిషన్ నాయక్
విశ్వంభర, మహబూబాబాద్ : హైదరాబాద్ పట్టణంలోని మూసా రాంబాగ్ రెవిన్యూ భవనం కార్యాలయంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంతి అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది . రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సామాజిక ఉద్యమ కారుడు గుగులోత్ కిషన్ నాయక్ ఎన్నికయారు . ఈ సమావేశానికి అసోసియేషన్ కన్వీనర్ కోవిడ చంద్రమౌళి అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా గూగులోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ, సర్వ సభ్యుల సమావేశంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని , ఈ రాష్ట్ర కమిటీలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నన్ను ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు . మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా కోవిడ చంద్రమౌళి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి బిక్షపతి , గౌరవ అధ్యక్షుడిగా కందుకూరి దేవదాస్ , తోపాటు వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు అని ఆయన అన్నారు. అంతే కాకుండా 2024 మార్చి నుండి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 2024 నుండి 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందారు . మొత్తం వారికి తక్షణమే అందవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు .