విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలి - తడక కల్పన ఫౌండేషన్ చైర్మన్ తడక చారులత
ప్రతిభ కనపరచిన విద్యార్థులకు వెండి పతకం ప్రశంస పత్రం అందజేసిన మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి
జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బొందుగుల సురేష్ రెడ్డి,
వెదిరె శకుంతలదేవి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యారాలు రమాదేవి
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి : విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి,తడక కల్పన ఫౌండేషన్ చైర్మన్ తడక చారులత అన్నారు.భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్, పదవ తరగతుల విద్యార్థులకు (2023-2024) 10 జిపిఏ,ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కళాశాలల వారిగా అత్యుత్తమ ప్రతిభ కనపరచిన వారికి ఐఐటీ ,నిట్ ,నీట్ జాతీయ పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థుల తడక కల్పన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వెండి పతకం తో పాటు ప్రశంస పత్రాన్ని మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి,తడక కల్పన ఫౌండేషన్ చైర్మన్ తడక చారులత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బొందుగుల సురేష్ రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి రాపోలు జ్ఞానేశ్వర్,తడక యాదగిరి చేతుల మీదుగా అందజేశారు. మొత్తం పదిహేను పాఠశాలల విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తడక కల్పన ఫౌండేషన్ చైర్మన్ తడక చారులత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఉత్తమ విద్యార్థులుగా అటుతల్లిదండ్రులకు సమాజానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు విద్యతోనే వస్తాయని వారన్నారు. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తడక యాదగిరి,పట్నం కృష్ణ కుమార్,చిక్కచంద్రమోహన్,దోర్నాల శ్రీనివాస్, రుద్ర పాండురంగం పంతులు,నాగభూషణరావు,కడవేరు వెంకటేశ్, నామని భాస్కర్,రావుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.