సుప్రీంకోర్టు సంచలన తీర్పు.

గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదంటూ తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.

  • కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియామకం. 
  • ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కోదండరాం అమీర్ అలీ ఖాన్. 
  • సుప్రీంకోర్టు తీర్పుతో ఇరువురి ఎమ్మెల్సీల పదవులు రద్దు. 
  • తదుపరి విచారణ సెప్టెంబరు 17కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.

విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేసేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం , అమీర్ అలీ ఖాన్ నియామకాలను చెల్లుబాటు కానివిగా ప్రకటించింది. ఈ కేసులో దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు, వారి వాదనలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

దీని పైన హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సుదీర్ఘ విచారణ జరిగింది. కాగా, ఈ రోజు కోదండరాం, ఆలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ.. తుది తీర్పు కోసం సెప్టెంబర్ 17వ తేదీకి సుప్రీం కేసు వాయిదా వేసింది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావణ్, సత్యానారాయణ ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నాటి కేబినెట్ ఎంపిక చేసి సిఫారసు చేసింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, ఆమీర్‌ అలీఖాన్‌ నియామకమైన విషయం తెలిసిందే. ఇద్దరిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రావణ్‌, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయా పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. ఎమ్మెల్సీలుగా కోదండ రామ్‌, ఆలీఖాన్‌ ప్రమాణ స్వీకారాన్ని తప్పుపట్టింది. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Read More చేనేత రుణమాఫీ, భరోసా అమలు చేయాలని కార్మికుల ధర్నా