హనుమకొండలో విహార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం
విశ్వంభర, హనుమకొండ : జిల్లా ప్రతినిధి :- హనుమకొండ భవాని నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విహార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వాణిజ్య రంగంలో ప్రజలకు అనుగుణంగా సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ విషయం అన్నారు. దీనిలో భాగంగానే విహార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను నిర్వాహకులు గణేష్ కిరణ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అని అన్నారు. నగర ప్రజలకు అందుబాటు ధరల తో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. నోరూరించే శాఖాహారం, మాంసాహారం విభిన్న రుచికరమైన ఆహార పదార్థాలను హనుమకొండ నగరంలో లభించడం ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ నగర ప్రజలకు మంచి పౌష్టికాహారాన్ని అందించే గొప్ప సంకల్పంతో బెంగళూరు నుండి ప్రత్యేక వంట చేసే బృందాన్ని విహార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తాయని అన్నారు. అన్ని అంగుళాలతో కూడిన లగ్జరీ రూమ్ లు కూడా అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.