సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్టీ ఎమ్మెల్యేలు
విశ్వంభర, హైదరాబాదు : మంత్రి సీతక్క ఆధ్వర్యంలో హైదరాబాదులో బుధవారం ఎస్టి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టి ఎమ్మెల్యేలు, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలపై మంత్రి సీతక్క తో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుండి గిరిజన అభివృద్ధి కోసం అధిక నిధులు రప్పించేలా తన వంతు చేస్తానని అన్నారు. అటవీశాఖ అధికారులు ఆదివాసీలను గిరిజనులను ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఏజెన్సీ ఏరియాలోనీ సాగు భూముల్లో బోర్లు వేయకుండా , పవర్ లైన్స్ రానీయకుండా అటవీ శాఖ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేల ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని మంత్రి సీతక్కని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి
త్వరలో అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వమని తప్పకుండా అన్ని వర్గాలతో పాటు మీ మీ సమస్యల పైన కూడా తప్పకుండా పరిష్కారం దిశగా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.



