డా. వేదాల శ్రీనివాస్ కు శ్రీ వైష్ణవ విశిష్ట వ్యక్తి పురస్కారం

డా. వేదాల శ్రీనివాస్ కు శ్రీ వైష్ణవ విశిష్ట వ్యక్తి పురస్కారం

విశ్వంభర, హైదరాబాద్ :- శ్రీ వైష్ణవ సంఘం, తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎల్.బీ నగర్ చంద్రపురి కాలనీలో శనివారం ఘనంగా "శ్రీ వైష్ణవ విద్యార్థి ప్రతిభా పురస్కారాలు - ప్రోత్సాహకాలు", "శ్రీ వైష్ణవ విశిష్ట వ్యక్తి పురస్కారాలు" మరియు "దేశికోత్తమ పురస్కారాల" ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములు తో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ అహోబిల జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కైర్వాయంట్, సినీ నిర్మాత మరియు మర్చెంట్ ఎక్స్పోర్టర్ అయిన డాక్టర్ వేదాల శ్రీనివాస్ కి "శ్రీ వైష్ణవ విశిష్ట వ్యక్తి పురస్కారం" ప్రదానం చేసి ఆయనను "హానరరీ డాక్టరేట్" ను అందుకున్న సందర్భం గా ఘనంగా సత్కరించారు. వేదాల శ్రీనివాస్ ఇటీవలే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం కెన్నెడీ యూనివర్సిటీ నుండి వారు కైర్వాయంట్గా చేసిన సేవలకు గాను "హానరరీ డాక్టరేట్" ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా, తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు,  కొప్పుల నరసింహా రెడ్డి కార్పొరేటర్ మన్సూరాబాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: