అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

విశ్వంభర, షాద్ నగర్ : ఆదివారం అమావాస్య పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణ శివారులోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ వీర ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో  ప్రధాన అర్చకులు రఘుపతి రావు, రాఘవేంద్రాచార్య, కృష్ణ, ప్రమోద్ పంతులు ఆధ్వర్యంలో భజన భక్త బృందం సభ్యులు, పట్టణ ప్రముఖులు హోమం నిర్వహించారు. అనంతరం గోమాతకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పట్టణానికి చెందిన మలిపెద్ది వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు మలిపెద్ది రంగయ్య, మానెమ్మ జ్ఞాపకార్థం గోవులకు పచ్చ గడ్డిని దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసాని నరసింహులు, మల్లిపెద్ది శ్రీనివాసులు, అన్నారం రఘు గౌడ్, కృష్ణయ్య, శిరీష, యాదగిరి, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: