త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు - సీఎం అత్యంత సన్నిహితుడు ఈరవత్రి అనిల్ కు అవకాశం .. !
- కాంగ్రెస్ నుండి నలుగురు ఎమ్మెల్సీ లు - బి ఆర్ ఎస్ నుండి ఒకరు
- అయితే కాంగ్రెస్ పార్టీ నుండి 4 ఎమ్మెల్సీ స్థానాలకు పోటా పోటీ నెలకొంది.
- కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో .. బీసీ కోటా కింద ఎమ్మెల్సీ కోసం చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్నారు.
- పద్మశాలి సామాజిక వర్గం నుండి ఈరవత్రి అనిల్ కు కేటాయింపు..! ?
విశ్వంభర, హైదరాబాద్ : మార్చి 9న జరగబోయే పద్మశాలి మహాసభల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా ..! రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ కులాల నుండి పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఆ వర్గం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగియడంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురూ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మార్చి 29వ తేదీ నాటికి శాసన మండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ స్థానాలు భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 20వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీంతో ప్రధాన పార్టీల్లోని ఆశావహులు ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు పొందేందుకు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌లు చేస్తున్నారు. ఈ 5 సీట్లలో కాంగ్రెస్‌కు 4 దక్కే అవకాశం ఉంది.
4 ఎమ్మెల్సీలు గెలిచే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల తాకిడీ ఎక్కువైంది. టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈరవత్రి అనిల్ ..
ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యే కోటాలో మాజీ ఎమ్మెల్యే , తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించే అవకాశంలో నేపథ్యంలో పద్మశాలి సామాజిక వర్గం నుండి ఈరవత్రి అనిల్ తనకు కేటాయించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో నాటి ప్రభుత్వ తీరును, అరాచకాలను, అక్రమాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శత విధాలుగా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి ఆనాడు టీపీసీసీ కట్టబెట్టిన నాటి నుండి నేటి వరకు రేవంత్ రెడ్డి తోనే రాజకీయ సభలు , ప్రచారాలలో వారి వెంట ఉంటూ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించారు. ఓ వైపు అక్రమ కేసులు బనాయించడానికి నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి బలంగా పోరాటం చేసారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కష్ట కాలం నుండి అధికారం వచ్చే వరకు ఎంతో పోరాటం చేశానని , అలాగే ఎమ్మెల్యే ఎన్నికలలో పద్మశాలి సామాజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క చోట కూడా స్థానం కేటాయించకపోవడం , అలాగే ఆనాటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను కోరుకున్న స్థానం నుండి మరొకరి కోసం త్యాగం చేయడం వంటి అంశాల నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలలో కీలకంగా సీఎం తో ఉండడం ఇవన్నీ కలిసొచ్చే అవకాశాలే అని, ఎమ్మెల్సీ కావడం ఖాయం పక్కా అంటూ అనిల్ సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
మార్చి 9న జరగబోయే పద్మశాలి మహాసభ పద్మశాలి హక్కుల కోసం సామాజిక , ఆర్ధిక , రాజకీయ చైతన్యం కోసం ఏర్పాటు చేసిన ఈ సభ ద్వారా పద్మశాలి సామాజిక వర్గం యొక్క బలాన్ని చూపించడానికి మేమెంతో మాకంత అనే వాటాపై కూడా బలమైన గొంతుకను వినిపించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈరవత్రి అనిల్ పద్మశాలి మహాసభకు సీఎం ను ఆహ్వానించడం జరిగింది. ముఖ్య అతిధిగా సీఎం రావడం చూస్తుంటే అదే విధంగా ఈ సభ ద్వారా ఈరవత్రి అనిల్ ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే ప్రకటన కూడా సీఎం చేస్తారనే సమాచారం రాజకీయ ప్రముఖులు, పద్మశాలి ప్రజాప్రతినిధులు నుండి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.



