సామాజిక తెలంగాణ సాధనే  బాపూజీ ఆశయం.  - గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం 

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు కు  కుల సంఘాల మద్దతు - బాపూజీ విగ్రహ సందర్శనలో పాల్గొన్న నేతలు 

సామాజిక తెలంగాణ సాధనే  బాపూజీ ఆశయం.  - గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం 

విశ్వంభర, పెద్ద అంబర్ పేట్ : సామాజిక తెలంగాణ లక్ష్యంగా బహుజనుల కోసం పోరాటం చేసిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత, ప్రధాన కార్యదర్శి పెద్ది జగదీష్  ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకై చేపడుతున్న కార్యక్రమాలకు బీసీ సంఘాల నేతలు, కుల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద అంబర్ పేట్ లో  బాపూజీ విగ్రహన్నీ  తయారు చేస్తున్న ప్రాంతాన్నీ బీసీ నేతలు సందర్శించారు. ఈ సందర్శనకు గుజ్జ సత్యం హాజరై మాట్లాడుతూ బాపూజీ విగ్రహాన్ని పరిశీలించి తయారు చేస్తున్న శిల్పి ఈశ్వరా చారి కి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే బహుజనుల రాజ్యాధికారం కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన యోధుడు అని అన్నారు. బీసీ ఉద్యమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు నేడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ను కదిలిస్తున్నాయి. ఈ బీసీ ఉద్యమాన్ని ఇక రానున్న రోజుల్లో ఉదృతం చేసి బీసీల రాజ్యాధికారం కళను సాకారం చేసుకుంటామని అన్నారు. బాపూజీ ఆశయాన్ని సాధించి తీరుతామని అన్నారు. అఖిల భారత పద్మశాలీ రాజకీయ విభాగం ప్రెసిడెంట్  , చేనేత ఇంచార్జి , నేతన్న యాత్ర నిర్వాహకులు బొల్ల శివ శంకర్ , బీసీ యునైటెడ్ ఫ్రంట్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్, బీసీ ఇంటెలెక్చవల్ ఫోరమ్ కో ఆర్డినేటర్ కేవీ గౌడ్ ,  బీసీ యునైటెడ్ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ వాసు కె యాదవ్ , విశ్వ కర్మ అధ్యక్షులు కౌలే జగన్నాధం , తెలంగాణ దళిత సమితి ఫౌండర్ పాల్వాయి వేణు పలువురు వక్తలు మాట్లాడుతూ  బడుగులు ఏకం కావాలి , బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేసి వారి ఆశయ సాధనకు కృషి చేయాలనీ అన్నారు. చేతి వృత్తులను ఏకం చేసి ఒక్క తాటిపై తీసుకొచ్చి సహకార సంఘాల ద్వారా వారికి ఒక భవిష్యత్తును కల్పించారని అలంటి మహనీయుడి విగ్రహం కేవలం ఇక్కడే కాదు రాష్టంలోని అన్ని ప్రాంతాలలో బాపూజీ విగ్రహ ఏర్పాటుకు పూనుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న తెలంగాణ బీసీ కులాల  సమన్వయ వేదిక బొమ్మ రఘరాం నేత , పెద్ది జగదీశ్  సభ్యులకు మనమంతా మద్దతు పలుకుతూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  జెల్ల నరేందర్ నేత, బొమ్మ దశరధ , బండారి ప్రసాద్, వెంకటేష్ , శ్రీను  తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 

Tags: