మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం 

మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం 

విశ్వంభర, గుండాల : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వస్తాకొండూరు గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ ప్రారంభించారు. మండల వైద్యాధికారి డా. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాములు, హెల్త్ ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు, ఎం.పి.హెచ్.ఎస్ డా. కరుణ, ఐటి రహీమ్, ఆశా వర్కర్లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: