చేనేతను కాపాడండి - ప్రింటింగ్ వస్త్రాలను నిషేధించండి - ఏడి వెంకటేశ్వర్లు
భూదాన్ పోచంపల్లి , విశ్వంభర:- టై & డై డిజైన్ల ను ప్రింటింగ్ వస్త్రాలపై నిషేధించాలని, చేనేతకు రిజర్వ్ చేసిన డిజైన్ల కాపీలను అరికట్టాలని, చేనేత వస్త్రాలు ధరించండి ,చేనేతను ప్రోత్సహించండి అనే నినాదంతో చేనేత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో చేనేత పరిరక్షణ మహార్యాలీ నిర్వహించారు చేనేత టై & డై సిల్క్ చీరల ఉత్పత్తి దారుల సంఘాల నాయకులు, ఈ ర్యాలీ లో చేనేత అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. భారత దేశ వారసత్వ సంపదను భౌగోళిక గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్పిన వారు తెలంగాణ చేనేత కళాకారులు, చేతిపై నేసిన వస్త్రాల్లో ఇక్కత్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారులు తెలంగాణ నేతన్నలు, సిద్దిపేట గొల్ల భామ చీరలు,గద్వాల్ చీర ,వరంగల్ టెర్రిస్, పుట్టపాక తేలియా రుమాల్ వస్త్రాలను తెలంగాణ చేనేత నేతన్నలు చేతితో విభిన్న డిజైన్లతో తయారు చేస్తున్నారు అని అన్నారు. వీటిని కొందరు వ్యక్తులు మార్కెట్లో ప్రింటింగ్ చేస్తూ నకిలీ చేనేత ఇక్కత్ వస్త్రాలు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. దీనివలన చేనేత కార్మికుల స్వయం ఉపాధి దెబ్బతింటుందని , దానికి వ్యతిరేకంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా టై అండ్ టై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ప్రింటింగ్ వ్యవస్థలు అరికట్టాలని మహా ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు . దీనికి ప్రభుత్వ పరంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తాం అని ఎడి వెంకటేశ్వర్లు, వినియోగదారులు కూడా చేనేత వస్త్రాలను ధరించి చేనేతను ప్రోత్సహించండి అని చేనేత అధికారి వెంకటేశ్వర్లు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తడక రమేష్, చేనేత కార్మికులు , పద్మశాలి కుల సంఘాల నాయకులు వ్యాపారస్తులు పాల్గొన్నారు