పర్వతగిరి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి . - సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు .
విశ్వంభర, మహబూబ్ బాద్ :- మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం జరిగింది .గ్రామ సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు . అనంతరం కేకు కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, అని అంబేద్కర్ ఏప్రిల్ 14 వ తేదీ 1891 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని మహు లో రామ్ జి , మాలోజి సక్పాల్ బీమా భాయ్ దంపతులకు జన్మించారు అని గుర్తు చేశారు. అంబేద్కర్ అన గారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీశాల్ని , అంటరానితనాన్ని ఎదిరించి , విద్యతో అద్భుతాలు సాధించి , స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయ శాఖ మంత్రిగా , రాజ్యాంగ ప్రదాతగా నిలిచారని ఆమె అన్నారు . మరియు అంబేద్కర్ విద్య విషయానికొస్తే సవాళ్లను అధిగమించి బాంబే విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారని , యూఎస్ఏ లోని కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారనీ ఆమె అన్నారు . అంబేద్కర్ ని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని , తీసుకోవాల్సిన బాధ్యత , ప్రతి ఒక్కరి పైన ఉందని పిలుపునిచ్చా రు . ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ , గ్రామ రెవెన్యూ అధికారి ఉప్పలయ్య , పార్వతగిరి గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .



