హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కరపత్రం విడుదల. -

ఆగస్ట్ 1 నుంచి 3 వ తేదీ వరకు వస్త్ర  ప్రదర్శన  

హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కరపత్రం విడుదల. -

ప్రజా విశ్వంభర, నారాయణగూడ ; ఆగస్ట్ 1 నుంచి 3 వ తేదీ వరకు చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం ప్రెసిడెంట్ గుంటక రూప సదాశివ్ పద్మశాలి భవన్ లో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సహకారంతో  అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు  కందగట్ల స్వామి   ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు.  మహిళా విభాగం ప్రెసిడెంట్  , ఎక్స్పో నిర్వాహకులు గుంటక రూప సదాశివ్  మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 8 రాష్ట్రాల నుండి వస్త్ర వ్యాపారస్తులు పాల్గొంటారని , అలాగే వివిధ రకాల అయిన వస్త్రాలతో పాటు  నేత వస్త్రాలు పోచంపల్లి , గద్వాల్ , నారాయణపేట , మంగళగిరి , ధర్మవరం, కంచి, ఉప్పాడ , ఇల్కల్ , సిద్దిపేట గొల్లభామ చీరలు  కూడా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయని అన్నారు. రెండవ సారి ఎక్స్పో నిర్వహించబోతున్నందుకు చాల సంతోషంగా ఉందని, గతంలో కంటే ఈ సారి మరిన్ని స్టాల్ల్స్ పెరిగాయని దసరా , దీపావళి పండగల ముందు ఇలాంటి ఎక్స్పో ద్వారా వ్యాపారస్తులు నాణ్యత తో కూడిన వస్త్రాలు అందించడంతో పాటు  కొనుగోలుదారులకు అతితక్కువలో లభించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు  కందగట్ల స్వామి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మార్కెటింగ్ పరంగా చేనేత వస్త్రాలు మంచి గుర్తింపును తెచ్చుకున్నాయని , ప్రతిఒక్కరు చేనేత వస్త్రాలను ధరించడం పట్ల సంతోషంగా ఉందని, ఈ ఎగ్జిబిషన్ ను అందరు వినియోగించుకొని చేనేత రంగాన్ని , చేనేత కళాకారులను  ఆర్ధికంగా ప్రోత్సహించడంలో  తోడ్పాటు అందించాలనీ అందరికి మనవి చేస్తున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్ , యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ ,  తెలంగాణ ప్రాంత పద్మశాలి ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ కుమార్ , జనరల్ సెక్రటరీ మాచర్ల రామ్ చందర్ , తెలంగాణ ప్రాంత మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్స్ కైరంకొండ స్వరూప , బోడ నిర్మల , జనరల్ సెక్రటరీ లు చిన్నకోట్ల సప్నా రాజ్ , మడూర్ శశికళ , ట్రెజరర్ నోముల రేఖ తదితరులు పాల్గొన్నారు. 

Tags: