రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం

రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం

ఇదిలా ఉండగా రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. ఫిలింసిటీలోని విశాలమైన ప్రాంతంలో స్మృతి వనం పేరుతో స్మారక కట్టడాన్ని నిర్మింపజేశారు. ఈ కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శనివారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన భౌతిక కాయాన్ని ప్రస్తుతం ఫిలింసిటీలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 9గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే రామోజీరావును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రామోజీరావుకు చెందిన వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఫిలింసిటీకి భారీగా చేరుకుని నివాళులర్పిస్తున్నారు. 

ఇదిలా ఉండగా రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. ఫిలింసిటీలోని విశాలమైన ప్రాంతంలో స్మృతి వనం పేరుతో స్మారక కట్టడాన్ని నిర్మింపజేశారు. ఈ కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దీన్ని బట్టి రామోజీరావు ఎంతటి ముందుచూపు కలిగిన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఇక, రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

Read More విప్లవ సింహం నల్లా నరసింహులు 

ఈ మేరకు స్మృతి వనంలో అధికారులు అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దఎత్తున ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫిలింసిటీలోని రామోజీరావు నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కాగా, రామోజీ రావు మృతికి నివాళిగా ఏపీలో రెండు రోజులు (ఆది, సోమ) సంతాప దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా ఇవాళ సినిమా షూటింగ్‌లకు నిర్మాతల మండలి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.