బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్

బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్

విశ్వంభర, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మచ్చ శాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాతబస్తీ ఫలక్ నుమాలోని బాలికల గురుకుల పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు, మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఉన్నత స్థానం ఎదగడానికి ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: