మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్ - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం
- పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం
విశ్వంభర, హైదరాబాద్ : ది పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం మే 1 వ తేదీన భూదాన్ పోచంపల్లి లో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర చేనేత , టెక్స్ టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ , వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండ వస్తానని హామీ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికుల తో ఇంటరాక్షన్ పోగ్రామ్ లో పాల్గొంటారని బ్యాంకు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి , ఎమ్మెల్యే , ఎంపీలకు చేనేత శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తడ్క వెంకటేష్ , భారత లవ కుమార్ , కొట్టం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.