బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి కి వినతి
On
విశ్వంభర, ఆమనగల్లు, ఆగస్టు 5: అమనగల్లు మండలం శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దయ్యాల బొడు తాండకు. కత్వా వాగు వంతెన నుంచి దయ్యాల బొడు తండా వరకు సుమారు 500 మీటర్ల దూరం వరకు బీటీ రోడ్డు లేక గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.సోమవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో గ్రామ మాజీ వార్డు మెంబర్ రాజు నాయక్.కసిరెడ్డి నారాయణరెడ్డి యూవసేన నాయకుడు విజయ్ రాథోడ్ కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మా గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి దయ్యాల బొడు తండాకు బీటీ రోడ్డు వచ్చే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూవజన నాయకులు శ్రీను .నవీన్ .రమేష్ .రాజేష్ .విజయ్ .వినోద్ .సాయి. రమేష్ తదితరులు పాల్గొన్నారు
Tags: vishvambhara