కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారు: ఈటల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతల అవినీతికి, దందాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారని ఈటల ఆరోపించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. ప్రశ్నించే గొంతుక లేకుంటే అధికార పక్షానిదే ఏకపక్షం అవుతుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
కాగా, త్వరలోనే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన తరఫున ఈటల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్ధిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.