పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు - తెలంగాణ ఉద్యమకారుడు , వీత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా. కాచం సత్యనారాయణ 

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు - తెలంగాణ ఉద్యమకారుడు , వీత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా. కాచం సత్యనారాయణ 

విశ్వంభర, హైదరాబాద్ :- మాదిగ హక్కుల కోసం అలుపెరుగని కృషి చేసిన నాయకుడు , మాదిగ రిజర్వేషన్స్ పోరాట సమితి వ్యస్థాపకులు మంద కృష్ణ మాదిగ కు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మశ్రీ పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న మంద కృష్ణకు తెలంగాణ ఉద్యమకారుడు , వీత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా. కాచం సత్యనారాయణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాదిగ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి , అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి అణగారిన , అట్టడుగు వర్గాలకు మార్గ దర్శకుడు మంద కృష్ణ మాదిగ అని కొనియాడారు. అన్ని వర్గాలకు , అన్ని జాతులకు ఆయన ఆదర్శం అని అన్నారు. ఆయన పోరాట పటిమ అమోఘం అని తెలిపారు.

Tags: