వైశ్యుల హక్కుల కోసం ఇక పోరాటమే - వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ -- డా. కాచం సత్యనారాయణ గుప్త

- డా. కాచం సత్యనారాయణ గుప్త 

 వైశ్యుల హక్కుల కోసం ఇక పోరాటమే -    వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ -- డా. కాచం సత్యనారాయణ గుప్త

విశ్వంభర,హైదరాబాద్ : వైశ్యుల హక్కుల సాధనకై  ఆగస్టు 3 సాయంత్రం 3 గంటలకు నాంపల్లి ఎగ్జీబిషన్  గ్రౌండ్స్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి బహిరంగ సభ సన్నాహక సమావేశం బడంగ్ పేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు . ఈ సమావేశానికి వైశ్య వికాస వేదిక , వైశ్య రాజకీయ రణభేరి అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మీర్పేట్, బడంగ్ పేట, బాలాపూర్ ఆర్య వైశ్య సంఘం సభ్యులతో కలిసి  వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు . అనంతరం కాచం సత్యనారాయణ మాట్లాడుతూ  వైశ్యుల హక్కుల కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం , ఆగస్టు 3 న హైద్రాబాద్, నాంపల్లి  ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  జరిగే వైశ్య రాజకీయ రణభేరి సభకు పెద్ద ఎత్తున  వైశ్యులందరు  హాజరు  కావాలని పిపులునిచ్చారు . అలాగే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమెంతో మాకు అన్నీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు . ఈడబ్ల్యుఎస్ వర్గీకరణ అంశాలతో పాటు వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని , ప్రతిఒక్కరు ఈ మీటింగ్ కు హాజరయ్యి విజయవంతం చేయాలనీ అయన  కోరారు. ఈ  కార్యక్రమం లో బాలాపూర్ మండల అధ్యక్షులు నల్ల శ్రీనివాస్ గుప్త, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ తెరటిపల్లి శ్రీనివాస్ గుప్త ,మీర్పేట్ అధ్యక్షులు మంచన ప్రేమ్ కుమార్ గుప్త, బడంగ్ పేట అధ్యక్షులు తోనుపునూరి శ్రీనివాస్ గుప్త,  ప్రధాన కార్యదర్శి మాదేటి మురళీధర్, ప్రధాన కార్యదర్శి ఇరవేంటి సురేష్ గుప్త, కోశాధికారి గందె వెంకటేశ్వర్లు,  పిఎస్ఆర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి ఉప్పల రవీందర్ గుప్త,  కోశాధికారి శ్యాంసుందర్, నల్ల  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

 

Read More జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చిరు కానుకల పంపిణీ. - BN రెడ్డి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత

 

 

Tags: