ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా.
On
విశ్వంభర, ఎల్బీనగర్ :- ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద గుప్తా అన్నారు. ఆదివారము చైతన్యపురి లోని సత్యనారాయణపురం కాలనీ పార్కులో విశిష్ట కన్స్ట్రక్షన్స్, సత్యనారాయణపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్సీ, కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త, మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి, వి 3, విశ్వంభర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ లు ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విశిష్ట కన్స్ట్రక్షన్స్ అధినేత, సత్యనారాయణపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుప్రజ హాస్పిటల్, శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో షుగర్ ,బీపీ, ఈసీజీ, టు డి ఇకో ,కంటి పరీక్షలు నిర్వహించమని తెలిపారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత శిబిరాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. సామజిక సేవలో విశిష్ట కన్స్ట్రక్షన్స్ ఎల్లప్పుడు ముందంజ లో ఉంటూ సేవలందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ విజయ్ కుమార్, కర్నాటి విజయ్ కుమార్, కాలనీ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ట్రెజరర్ శ్రీకాంత్ గౌడ్, సీనియర్ సిటిజన్ సభ్యులు వెంకటరెడ్డి, నారాయణ, రాజగోపాల్, చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు ఇందిర, పుష్ప, నందన, కర్నాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 
